ఏపీలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రారంభించిన స్మార్ట్ కార్డుల జారీ కొనసాగుతుండగా.. ఇప్పుడు వాటిలో మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం సిద్దమైంది.
దీనికి సంబంధించిన వివరాలను పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రకటించారు. అలాగే స్మార్ట్ కార్డులు రాని వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారో కూడా వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు పారదర్శకంగా బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్మార్ట్ రైస్ కార్డులను కొన్ని చోట్ల 85 శాతం, మరికొన్ని చోట్ల 95 శాతం షెడ్యూల్ లో పేర్కొన్న ఆయా జిల్లాల్లో రేషన్ షాపులు వద్ద, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్దులకు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నామన్నారు. నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్ద, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు విడతలుగా ప్రజలకు ఈకెవైసీ ఆధారంగా ఈ కార్డులు అందిస్తున్నామన్నారు.
స్మార్ట్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఈకెవైసీ, ఆధార్ ఆధారంగా కార్డులను ముద్రించామని, పేర్ల మార్పు, చిరునామాల మార్పులు చేసుకోకపోవడం వల్లే ఈ తప్పులు జరిగినట్లు మంత్రి తెలిపారు. పోర్టబులిటీ ఉన్నందున సరుకులు ఏ రేషన్ షాపు నుంచైనా తీసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇప్పుడు కార్డులు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే.. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందన్నారు. అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రేషన్ షాపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఆయా షాపు వద్ద ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ను మీ ఫోన్ లో స్కాన్ చేసి, అక్కడ కార్డు దారులు తమ ఇబ్బందులు తెలియచేయవచ్చన్నారు. నవంబర్ 1 వ తేదీ నుంచి నామినల్ ఫీజు రూ. 35 చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 31 వరకు మాత్రం ఉచితంగా నిర్ధేశించిన ప్రాంతాల్లో ఈ స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు.