కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు చైర్మన్లను నియమించింది.
అలాగే, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను నియమించింది. వివిధ ఆలయాల బోర్డులకు చైర్మన్లను నియమిస్తూ ఓ జీవో విడుదల చేసింది.
1.భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు
2.కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3.వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4.దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
5. వేంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు
టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం
1. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏవీ రెడ్డి
2. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్
3. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు
4. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి
5. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా
6.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే
































