చాలా ఇండ్లలో ఉదయం హడావిడి వాతావరణం కనిపిస్తోంది. మార్నింగ్ టిఫిన్స్, లంచ్ ప్రిపేర్ చేసే పనిలో గృహిణులు బిజీగా ఉంటారు. అలాంటి సమయాల్లో తక్కువ పదార్థాలతో ఈజీగా ఇంకా సింపుల్‌గా తయారు చేసుకునే రెసిపీని తీసుకొచ్చాం. దీనిని లంచ్‌లోనే కాక చపాతీలోనూ తినొచ్చూ. అదేనండి బంగాళదుంపల కర్రీ. అంతేకాక కుక్కర్లో నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తూ ఇది చేశారంటే టేస్ట్ అద్దిరిపోతుంది!
కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంపలు – 2
- నూనె – 3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – అర టీ స్పూన్
- జీలకర్ర – అర టీ స్పూన్
- ఉల్లిపాయలు – 2
- ఉప్పు – 1 టీ స్పూన్
- పసుపు – అర టీ స్పూన్
- పచ్చిమిర్చి – 4
- పుదీనా – కొద్దిగా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
- కారం – 2 టీ స్పూన్లు
- ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్
- గరంమసాలా – పావు టీ స్పూన్
- జీలకర్ర పొడి – అర టీ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కొత్తిమీర – కొద్దిగా
-
తయారీ విధానం :
- ముందుగా రెండు బంగాళదుంపలను కడిగి పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని మీడియం సైజ్‌లో ముక్కలుగా కట్ చేసుకోని నీళ్లలో నానబెట్టుకోవాలి.
- ఇంకోవైపు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను మిక్సీజార్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం టమోటా పేస్టును గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచాలి.
- మరోవైపు కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి.
- అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి. దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా వేసి వేగనివ్వాలి.
- అనంతరం ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులోనే టమోటా పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం, ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరంమసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత కప్పు నీళ్లు పోసి కలపాలి. అనంతరం కుక్కర్‌పై మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
- విజిల్స్ అయిపోయాక చివరన సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఓసారి కూరను కలిపి పక్కకు దించుకున్నారంటే బంగాళదుంప కర్రీ సిద్ధమైట్లే.
- ఈ కర్రీని అన్నంతో పాటు చపాతీలోనూ తిన్నొచ్చు.
- అంతేకాకుండా సింపుల్‌గా నిమిషాల్లోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
































