రాగి..చిరుధాన్యాలలో ఒకటి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రాగులతో చేసే ఆవిరి కుడుములు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో తీనడానికి బెస్ట్ ఛాయిస్.
రాగి ఆవిరి కుడుములు తయారు చేయడం సులభం. రాగి కుడుములు అద్భుతమైన పోషక విలువలు, సులభమైన జీర్ణక్రియ, అధిక కాల్షియం ఐరన్ కంటెంట్ కారణంగా సంప్రదాయ, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎంపికగా నిలుస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ కుడుములు పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ చాలా మంచిది. చుక్క ఆయిల్ లేకుండా రాగి కుడుములు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగిపిండి
-ఆవాలు
-జీలకర్ర
-పొట్టు మినపప్పు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయలు
-ఆయిల్
-ఉప్పు
-పచ్చి శెనగపప్పు
రాగి కుడుములు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, పొట్టు మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసి 1 ఇంచు అల్లం సన్నని తరుగు, 1 చిన్న ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిరపకాయల సన్నని ముక్కలు వేసి 30 సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి,రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నీటిని 1 మరుగు వచ్చేదాకా మరిగించుకోవాలి.
-నీరు మరుగుతున్నప్పుడు అందులో ఒకటిన్నర కప్పు రాగిపిండి వేసుకోవాలి.మంటను తక్కువలో ఉంచి పిండిమొత్తం ఆ నీటిలో కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా చల్లుకొని పిండిలో అది కూడా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేసి కలిపిన పిండిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి.
-తర్వాత ఇడ్లీ పాత్రలోని ప్లేట్లలోని గుంటలకి ఆయిల్ లేదా నెయ్యి అప్లయ్ చేసుకొని వాటిలో వత్తుకున్న బాల్స్ ను ఉంచండి.
-ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి మరగడానికి దగ్గరకి వచ్చాక ఉండలు పెట్టి ఉంచిన ఇడ్లీ ప్లేట్లను పాత్రలో సెట్ చేసుకొని మూతపెట్టి 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆప్ చేసేసి ప్లేట్ ను బయటకు తీసి చల్లారనిచ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ రాగి కుడుములు రెడీ. వీటని పల్లీ చట్నీతో తింటే ఆ మజానే వేరు.
































