బట్టలు తెల్లగా మెరవాలా..? పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ వేస్తే సరి..! రిజల్ట్ చూసి షాక్ అవుతారు

ప్రతిరోజూ సోషల్ మీడియాలో హక్స్, ట్రిక్స్ వైరల్ అవుతూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు పాత్రలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు.


కొందరు ఇల్లు శుభ్రం చేయడానికి నిమ్మకాయను వాడుతుంటారు. కానీ ఈసారి, ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. ఇది జనాల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే..ఈ వీడియోలో ఒక మహిళ పారాసెటమాల్ మాత్రలను డిటర్జెంట్‌గా ఉపయోగిస్తుంది. అవును పారాసెట్మల్ మాత్రలతో బట్టలు ఉతుకుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ట్రిక్ వాస్తవానికి బట్టలు మెరిసేలా చేస్తుంది. వీడియో చూసే వ్యక్తులు దీనిని మ్యాజిక్ అని పిలుస్తున్నారు. మరికొందరు దీనిని వైద్య మందుల దుర్వినియోగం అని కూడా అంటున్నారు.

వైరల్ వీడియోలో ముందుగా ఒక మహిళ తన వాషింగ్ మెషిన్ దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె తన లాండ్రీలో పారాసెటమాల్ మాత్రలను వేసి మెషీన్‌ ఆన్ చేస్తుంది. కొంత సమయం తర్వాత బట్టలు బయటకు తీసినప్పుడు, అవి మెరిసిపోతూ, ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తాయి. ఆ మహిళ కాలర్ పసుపు రంగులోకి మారిన తెల్లటి చొక్కాను బయటకు తీసినప్పుడు వీడియోలో అత్యంత షాకింగ్ భాగం వస్తుంది. ఆమె దానిని నీటితో నిండిన టబ్‌లో వేసి కొన్ని పారాసెటమాల్ మాత్రలను వేస్తుంది. కొంతటైమ్‌ తర్వాత చొక్కాను బయటకు తీసినప్పుడు దాని కాలర్ పూర్తిగా తెల్లగా, కొత్తదిగా ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.