రెండు జనరేషన్లలో మెగా vs నందమూరి ఫ్యామిలీ పోటీలో ఆధిపత్యం ఎవరిది..?

ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలైతే వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.


అలాంటి సందర్భంలో ఇక మీదట వాళ్ళ నుంచి రాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఎంత మంది హీరోలుగా ఉన్నప్పటికి మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మధ్య తీవ్ర తరమైన పోటీ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు ఇండస్ట్రీలో మంచి ఆదరణ దక్కుతోంది. దాంతో పాటుగా వాళ్ల సినిమాలను చూడటానికి ప్రేక్షకులైతే ఆసక్తిని చూపిస్తూ ఉండడం విశేషం… ఒకప్పుడు చిరంజీవితో నందమూరి బాలకృష్ణ పోటీపడ్డాడు. అదే సమయంలో చిరంజీవి ప్రతి సినిమాతో తనను తాను వెలివేట్ చేసుకుంటూ సూపర్ హిట్ సినిమాలు చేశాడు. కాబట్టి బాలయ్య బాబుకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా తన ముందుకు దూసుకెళ్లాడు. ఇప్పటికీ చిరంజీవి బాలయ్య మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే చాలు వాటిలో ఎవ్వరి సినిమా సూపర్ సక్సెస్ అవుతోందా అనే దాని మీదనే ప్రేక్షకుల యొక్క అటెన్షన్ అయితే ఉంటుంది.

ఇక వీళ్ల తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ కి గట్టి పోటీని ఇస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ డామినేషన్ కనిపిస్తోంది. తద్వారా రెండు జనరేషన్ లలో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ ని డామినేట్ చేస్తూ వస్తున్నారు.

ఇక మెగా హీరోలు మూడో జనరేషన్లో కూడా అదే ఫార్ములాని ఫాలో అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖిరా నందన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలను డామినేట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు.

ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్న ఆయన తొందరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా సమాచారమైతే అందుతోంది. ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ కి అలాగే నందమూరి జానకిరామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ కి అఖిరా గట్టి పోటీ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.