బామ్మర్ది నితిన్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్…అదేంటో తెలిస్తే షాక్ అవుతారు..?

యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.


ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య కథాంశమైతే ఉంటుంది. గత సంవత్సరం దేవర సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన భారీ సక్సెస్ ని సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. అయినప్పటికి పాన్ ఇండియా ప్రేక్షకుల మన్ననలు పొందాడు.ఇక ఈ ఇయర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అయింది. ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బామ్మర్ది ఆయన నార్నే నితిన్ శివాని తలకూరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఈ పెళ్లి మొత్తాన్ని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరి చూసుకున్నాడు… గత 24 గంటల నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ పెళ్లి మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ హడావిడి మాములుగా లేదు. ఆయన చేసిన ప్రతి యాక్టివిటీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తన అభిమానులు ఆనందపడుతున్నారు.

అలాగే తన బామ్మర్ది అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేస్తూ నితిన్ పెళ్లి తనే దగ్గరుండి జరిపించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే నార్నే నితిన్ కి, జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తనకి ఒక ఖరీదైన కారును ఇస్తున్నాడట.

అలాగే ఎన్టీఆర్ గిఫ్ట్ గా ఒక స్టార్ డైరెక్టర్ తో నితిన్ సినిమా చేసే విధంగా ప్లాన్ చేశాడట…ఆ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంచి నితిన్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడట. ఇక ఇప్పుడే పెళ్లి అయింది కాబట్టి మరో రెండు రోజుల్లో ఆ సస్పెన్స్ కి తెర దించుతూ నితిన్ పెద్ద డైరెక్టర్ తో చేయబోయే సినిమాను అనౌన్స్ చేస్తారట…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.