బ్యాచిలర్స్ స్పెషల్.. అద్దిరిపోయే చికెన్ ఫ్రై.. క్షణాల్లోనే

సాధారణంగా బ్యాచిలర్స్ ఇతర వంటకాలకంటే చికెన్ ఎక్కువగా చేసుకునేందుకు ఇష్టపడతారు. చికెన్ అయితే ఈజీగా చేసుకోవడంతోపాటు ఎలా వండినా టేస్టీగా ఉంటుందని బ్యాచిలర్స్ అనుకుంటారు. అలాగే చికెన్ కు ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కాబట్టి బ్యాచిలర్ బాయ్స్ చికెన్ చేసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా చికెన్ ఫ్రై చేసుకోవాలని ఉందా..? అయితే ఈ రెసిపీని ట్రై చేయండి.. తక్కువ పదార్థాలతోనే ఈ చికెన్ ఫ్రై పూర్తవుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే సూపర్ టేస్టీగానూ ఉంటుంది. మరి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి..?


చికెన్ ప్రై చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఓసారి చూస్తే.. చికెన్ అరకేజీ తీసుకోవాలి. నూనె 3 లేదా 4 స్పూన్లు, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టమాటా, రెండు స్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి, గరం మసాలా తగినంత, కారం రుచికి సరిపడా, కొత్తి మీర కొద్దిగా.. తీసుకోవాలి.

తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను కడిగిపెట్టుకోవడం, అలాగే ఉల్లిపాయలు, మిర్చి, టమాటా కట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు వేసుకుని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ వేసుకోవాలి. చికెన్ ముక్కలను వేశాక.. స్టవ్ ను హై ప్లేమ్ కు మార్చి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని బాగా కలపాలి. చికెన్ ముక్కల నుంచి నీళ్లు పోయి ముక్కలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకూ వేయించుకోవాలి.

ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత టమాట ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు ఉడికిపోయి.. చికెన్ ముక్కలు ఎర్రగా వేగిన రంగులోకి మారుతాయి. అప్పుడు రుచికి సరిపడా తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చికెన్ ముక్కలకు పట్టే విధంగా సన్నని మంటలో వేయించుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్ ఫ్రై రెడీ అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.