మీ దగ్గర జస్ట్‌ రూ.50 వేలుంటే.. ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! రోజుకు రూ.3000 సంపాదన మీ సొంతం..

చాలా మందికి ఒక మంచి బిజినెస్‌ చేస్తూ.. లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని అనుకుంటారు. కానీ, పెట్టుబడి సమస్య వల్ల బిజినెస్‌ చేయలేక ఆగిపోతుంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుమైన బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


దీని కోసం పెద్దగా పెట్టుబడి అక్కర్లేదు. జస్ట్‌ ఒక్క రూ.50 వేలు ఉంటే చాలు వ్యాపారం మొదలుపెట్టేయొచ్చు. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటంటే.. స్టేషనరీ షాప్‌.

చక్కటి ఆదాయం పొందేందుకు స్టేషనరీ షాప్ ఒక మంచి అవకాశం. నిరుద్యోగులైన యువతీ యువకులు ముద్ర రుణం ద్వారా రుణం తీసుకున్న అనంతరం ఈ షాపులో తెరిచి చక్కటి ఆదాయం పొందవచ్చు. నిజానికి సంవత్సరం పొడుగునా స్టేషనరీ బిజినెస్ కు డిమాండ్ ఉంటుంది. విద్యార్థులకు స్టేషనరీ అవసరాలు ఎంతో ఉంటాయి. అలాగే ఆఫీసు అవసరాలకు కూడా స్టేషనరీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా జిరాక్స్, ప్రింటింగ్, లామినేషన్ వంటివి కూడా పెట్టుకున్నట్లయితే అదనంగా డబ్బు సంపాదించుకోవచ్చు. స్టేషనరీ దుకాణం ఏర్పాటు చేయడానికి ప్రారంభం పెట్టుబడి 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సంవత్సరం మొత్తం సరిపడా సరుకు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి తెచ్చుకోవడం ద్వారా మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి బ్రాండ్ సరుకులు గుర్తించి, ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీలో చదివే విద్యార్థిని విద్యార్థుల అవసరాలు, వారు ఏ బ్రాండ్ పుస్తకాలు, పెన్నులు, ఇతర స్టేషనరీ ఉత్పత్తులు వాడుతున్నారో తెలుసుకొని వాటిని అందుబాటులో ఉంచినట్లయితే చక్కగా వ్యాపారం సాగుతుంది. ఈ బిజినెస్‌ను స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు దగ్గరగా షాపును ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి గిరాకీ లభిస్తుంది. ఈ షాపులో చక్కటి గిరాకీ ఉన్నట్లయితే సీజన్లో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.