మూడు భారీ ప్లాప్స్ నుండి దుల్కర్ సల్మాన్ గ్రేట్

ననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర.


ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు. ఆ ప్లేసులోకి శివకార్తీకేయన్, జయం రవి, శ్రీలీలను తీసుకుని మూవీ కంప్లీట్ చేసింది దర్శకురాలు.

పరాశక్తి ఫ్లాప్ నుండే కాదు.. దుల్కర్ మరో రెండు తమిళ డిజాస్టర్స్ నుండి తెలివిగా ఎస్కేప్ అయ్యాడంటోంది మాలీవుడ్. కమల్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్2లో సిద్దార్థ్ రోల్ తొలుత దుల్కర్ కోసం అడిగారని సమాచారం. కానీ డీక్యూ ఇతర ప్రాజెక్ట్స్ వల్ల నో చెప్పాడు. కట్ చేస్తే.. ఇండియన్2 రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఒక్కసారే కాదు.. థగ్ లైఫ్‌లో కూడా ఉళగనాయగన్ ఓ రోల్ ఆఫర్ చేస్తే తిరస్కరించాడు దుల్కర్. ఇలా వరుసగా త్రీ డిజాస్టర్స్ నుండి దుల్కర్ తప్పుకోవడంతో లక్కీ బాయ్ అంటోంది మాలీవుడ్. ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్బ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ మూడు తమిళ బాంబ్స్ నుండి తప్పించుకున్న దుల్కర్.. మరో కోలీవుడ్ మూవీకి బలయ్యాడు. గత ఏడాది వచ్చిన కాంత ఫిల్మ్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు నెక్ట్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఆకాశంలో ఓ తారతో రాబోతున్నాడు ఈ లక్కీ భాస్కరుడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.