గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచబోయేది లేదని టీజీసెట్-2026 కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు.
ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
5వ తరగతితోపాటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ సొసైటీల్లో 6 నుంచి 9వ తరగతు ల్లో ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. 21వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, గడువును పొడిగించేది ఉండబోదని స్పష్టంచేశారు. వివరాలకు https://tgcet. cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
































