గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మంగళగిరిలోని టిడ్కో (TIDCO) ఇళ్ల సముదాయంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న కుటుంబ వివాదం క్షణాల్లోనే ఘర్షణగా మారి, ఒక ప్రాణాన్ని బలిగొన్న దుర్ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది.
భార్యాభర్తల మధ్య గొడవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో ఇళ్ళ సముదాయంలో ఓ ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భార్య భర్తను కత్తితో పొడిచే హతమార్చే దాకా వెళ్ళింది. టీవీ సౌండ్ తగ్గించాలని భర్త అహ్మద్ కోరడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. సాధారణంగా చిన్నగా మొదలైన వారిద్దరి గొడవ క్రమంగా తీవ్రతరమైంది. కత్తితో భర్తను పొడిచిన భార్య దీంతో ఆవేశానికి లోనైన భార్య క్రాంతి కిచెన్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి అహమ్మద్ పైన దాడి చేసింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన అహ్మద్ ను సమీప ఆసుపత్రికి తరలించిన కూడా అతని ప్రాణాలను వైద్యులు నిలపలేకపోయారు. అప్పటికే అహ్మద్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వివాహం.. ఆపై మనస్పర్ధలు సంవత్సరం క్రితం ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్టు సమాచారం. మొదట్లో సంతోషంగానే గడిపిన ఈ జంట ఇటీవల కాలంలో చిన్న చిన్న విభేదాలతో తరచూ గొడవ పడుతున్నారు అని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అయితే ఇద్దరి మధ్య గొడవలకు పెద్ద కారణాలు ఏమీ లేవని, పెద్దగా కుటుంబ కలహాలు వంటివి కూడా బయటకు రాలేదని వారు అంటున్నారు.
భర్తను చంపిన భార్య జైలు పాలు ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకు ప్రాణాలు తీసేదాకా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. గొడవ ఏదైనప్పటికీ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి కానీ దాడులకు వెళితే సమస్య పరిష్కారం కాకపోగా జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది క్షణికావేశంలో భర్తను చంపిన సదరు భార్య తన భవిష్యత్తును కోల్పోయి జైలు పాలవుతోంది.




































