అన్ని రాశుల్లో కుబేరుడి అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మనం ఏ పని చేసిన ఆయన చల్లని చూపు లేకపోతే వచ్చేడి కూడా వెనక్కి పోతుంది. కుబేరుడికి ఇష్టమైన రాశులు మీద ఆయన చూపు ఎప్పుడూ ఉంటుంది. మరి, మీ రాశి ఉందా?
కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు ఉంటాయని తెలుసా. ఆ రాశుల వారికీ తిరుగు ఉండదు. మరి, ఆ అదృష్ట రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి : వృషభ రాశి వారి మీద కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు గట్టిగా ఏం తలచుకున్నా సరే అది నెరవేరుతుంది. అంతేకాదు, వీళ్ళు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకి డబ్బు వర్షం కురుస్తుంది.
తుల రాశి : కుబేరుడి అనుగ్రహంతో తుల రాశి వారి గౌరవం పెరుగుతుంది. అంతేకాదు పెట్టుబడులు పెట్టిన చోట అధిక లాభాలు వస్తాయి. వీళ్ళు ఏదైనా పని చేసే ముందు కుబేరా అని తలచుకుంటే చాలు ఆ పనికి తిరుగుండదు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారి మీద కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీళ్లు ఎక్కడ డబ్బు పెడితే అక్కడ రెట్టింపు అవుతుంది. అలాగే, కుబేరుడి ఆశీస్సులు వీరి మీద ఉన్నంత వరకు వారికీ ఏ విషయంలో లోటు ఉండదు. కుటుంబ సమస్యలు కూడా ఉండవు. జీవితంలో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి : కుబేరుడి అనుగ్రహంతో ధనుస్సు రాశి వారి సంపద, ఆస్థి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పేరు, మర్యాద పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళు ఎదగగలరు. జీవితంలో ఆర్థికంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు.



































