Western Railway 5349 posts: భారత రైల్వే శాఖ Western Railway అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు Railway Recruitment Cell Western Railway అధికారిక వెబ్సైట్ rrc-wr.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5,349 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారత రైల్వే శాఖ Western Railway అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు Railway Recruitment Cell Western Railway అధికారిక వెబ్సైట్ rrc-wr.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5,349 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 21, 2026 దరఖాస్తుల చివరి తేదీ: మార్చి 23, 2026
అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్)లో కనీసం 50% సగటు మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్లో NCVT అనుబంధ ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
అభ్యర్థుల వయస్సు మార్చి 23, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.)
ఎంపిక విధానం
ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 10వ తరగతి (కనీసం 50% మార్కులతో), ITIలో పొందిన మార్కుల శాతం సగటును తీసుకుని, రెండింటికీ సమాన వెయిటేజీ ఇచ్చి మెరిట్ జాబితా తయారు చేస్తారు.
ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
దరఖాస్తు రుసుము
సాధారణ/ఓబీసీ అభ్యర్థులకు: ₹100/- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు రుసుము మినహాయింపు
చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / UPI / ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్ లావాదేవీ ఛార్జీలు (ఉంటే) అభ్యర్థులే భరించాలి.
వెస్టెర్న్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.rrc-wr.com/rrwc/Files/2683.pdf
ఆన్ లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.rrc-wr.com/



































