Theertham: గుడిలో తీర్థము తీసుకున్నప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే అలా తప్పులు చేసి తీర్థం తీసుకున్నా పుణ్యం దక్కదట. అలాగే గుడికి వెళ్లాక ఎలా ఉండాలో కూడా ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయం గుడికి ఎలా వెళ్లాలో చాలా మంది చెప్తుంటారు. సంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి. గుడిలో మౌనంగా ఉండాలి. దైవనామస్మరణ మాత్రమే చేయాలి ఇలాంటి విషయాలు చాలా మంది చెప్తుంటారు కానీ గుడిలో తీర్థం ఎలా తీసుకోవాలా చాలా తక్కువ మందే చెప్తుంటారు. అంతకన్నా తక్కువ మంది భక్తులకు మాత్రమే ఆ విషయం తెలిసి ఉంటుంది. అయితే గుడికి వెళ్లాక అక్కడి దేవుడిని మొక్కడం నుంచి తీర్థం తీసుకునే వరకు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడిలో దీపం వెలిగించే పద్దతి: దీపపు ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను ( దీపారాధన) వెలిగించాలి. దీపాన్ని ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి. గుడిలో ఎప్పుడూ దీపము ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించిన వెంటనే బయటకు వెళ్ళరాదు. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు. స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
ఏ రోజు ఏ ఆలయానికి వెళ్లాలి:
పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. తులసి దళములను పూజ చేస్తున్నప్పుడు దలములుగానే దేవుడికి సమర్పించాలి. ఆకులుగా త్రుంచి వేస్తే దోషమట. ఏ పుష్పములు అయినా త్రుంచి, ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవిస్తుందట. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు, గౌరిమాత ఆలయం, మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, బుధవారం వినాయకుడు, అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. అలాగే వినాయకుని ఒకటి, ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు, విష్ణు మూర్తికి నాలుగు, మర్రిచెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యటం మంచిదట.
మొదట ధ్వజస్థంభ దర్శనం:
ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి. ఇక గుడిలో తీర్ధము ౩సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలట. వెంట వెంటనే మూడుసార్లు లేదా ఒకేసారి మూడు సార్లు తీర్థం తీసుకోకూడదట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.



































