| థైరాయిడ్ ఉన్నవారికి వరం.. ఈ నట్స్‌.. విడిచిపెట్టకుండా తినాల్సిందే

మనకు తినేందుకు ఎన్నో రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. గింజల పేరు చెప్పగానే చాలా మంది వాల్ నట్స్‌, బాదం, జీడిపప్పు, పిస్తాలను నట్స్‌గా భావిస్తుంటారు.


అయితే కేవలం ఇవే కాదు, నట్స్‌లో ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో బ్రెజిల్ నట్స్ కూడా ఒకటి. ఇవి ఇతర నట్స్‌తో పోలిస్తే సైజులో కాస్త పెద్దవిగా ఉంటాయి. కనుక ఈ నట్స్‌ను రోజుకు 3 తిన్నా చాలు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బ్రెజిల్ నట్స్ మనకు ప్రస్తుతం అంతటా లభిస్తున్నాయి. పేరుగాంచిన మెడికల్ షాపులతోపాటు సూపర్ మార్కెట్లలోనూ మనకు బ్రెజిల్ నట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా ఈ నట్స్‌ను తినాలి. ఇలా రోజూ తింటుంటే అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్య తగ్గేందుకు..

బ్రెజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే మనకు రోజుకు కావల్సిన దాని కన్నా అధిక మొత్తంలోనే సెలీనియం మనకు లభిస్తుంది. సెలీనియం వల్ల పలు జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు లేదా థైరాయిడ్ ట్యాబ్లెట్లను రోజూ వాడుతున్నవారు బ్రెజిల్ నట్స్‌ను రోజూ తింటుంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. దీంతో జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. థైరాయిడ్ ఉన్నవారికి బ్రెజిల్ నట్స్‌ను వరంగా చెబుతారు.

రోగ నిరోధక వ్యవస్థకు..

బ్రెజిల్ నట్స్‌లో విటమిన్ ఇ, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి. ఇవి పలు ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసేందుకు సహాయం చేస్తాయి. వీటి వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. గుండె వాపులకు గురి కాకుండా సురక్షితంగా ఉంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్, డయాబెటిస్‌, క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బ్రెజిల్ నట్స్ లో అధికంగా ఉండే సెలీనియం రోగ నిరోధక వ్యవస్థకు కంచు కోటలా నిలుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల తెల్ల రక్త కణాలు అధికంగా తయారవుతాయి. ఇవి శరీరంలో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు చేరకుండా చూస్తాయి. రోగాల నుంచి రక్షిస్తాయి.

హార్ట్ ఎటాక్ రాకుండా..

బ్రెజిల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఈ నట్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా రక్షిస్తాయి. బ్రెజిల్ నట్స్ షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బ్రెజిల్ నట్స్‌ను ఉదయం తినడం వల్ల రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట రావు. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. ఇలా ఈ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.