భారత్‌లో జాతీయజెండా(National Flag)కు ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటిమీదున్న బట్టల ఎంత శ్రద్ధ పెడతారో తెలియదు కానీ..
జాతీయ జెండాకు మాత్రం ఎక్కడా అవమానం జరుకుండా చూస్తారు. ముఖ్యంగా ఆగష్టు 15వ తేదీన నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవాన్ని, జనవరి 26వ తేదీన జరుపుకునే గణతంత్ర దినోత్సవాలను ఎంతో జాగ్రత్తగా, పవిత్రంగా నిర్వహించారు. అయితే.. అంత గొప్పగా భావించే జాతీయ జెండాను కొందరు ఘోరంగా అవమానించారు. ఇటీవల సరిహద్దుల్లో దేశ మాత కోసం పోరాడుతూ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీ నాయక్(Jawan Murali Nayak) వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
ఆయనకు నివాళిగా కదిరి(Kadiri సెంటర్‌లో పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్‌లో జాతీయ జెండాలో పైన గ్రీన్ కలర్, కింద వైట్, ఆ కింద ఆరెంజ్ కలర్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లిన కొందరు దీనిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో కటౌట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీర జవాన్‌కు నివాళిగా ఏర్పాటు చేసే కటౌట్‌లో ఆ మాత్రం జాగ్రత్తగా ఉండటం తెలియదా? అని మండిపడుతున్నారు.