A heart touching story : నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:

నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…

నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది…

గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది…

తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…

నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్…

ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద…

నా భార్య నామీద అరిచింది…

నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను… నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను…

గాయపడ్డట్టుగా తన కళ్లు…
నావైపు అదోలా చూశాడు…

నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…

ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను…

ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు…

మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు…

నాలో అదే దోషభావన…

ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది…
నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…

కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం…

పెయింటర్స్ వచ్చారు…

తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…

ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా…
“మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం”సరేనా అని సముదాయించారు…

అలాగే చేశారు…

ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం…
ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు…
వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…!

కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది…

నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు…

నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది…

నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…

ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను…

ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… “నాన్నా! గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్” అని మందలించాడు…

మనవరాలు వచ్చింది, “నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా”అంది ప్రేమగా…

నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు…

నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…
నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది…

గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది…

టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…

నా గదిలోకి వచ్చి పడుకున్నాను… మౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను…

తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది… ✍️

A heart touching story

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *