OTT Movie: 3 కోట్లతో నిర్మించి రూ. 70 కోట్లు వసూలు చేసింది.. 2 గంటల నాన్ స్టాప్ సస్పెన్స్

హారర్ సినీప్రియుల కోసం ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త లు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం సస్పెన్స్ థ్రిల్లర్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్.


ప్రేక్షకులకు ఆధ్యంతం ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కొనసాగించే చిత్రాలు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ అవుతున్న రోమాంచం. 2023లో విడుదలైన ఈ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. జీతు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ హారర్ కామెడీ లో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, సజిన్ గోపు , సిజు సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. బెంగుళూరులో ఒక గదిలో అద్దెకు ఉన్న ఏడుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఒకరాత్రి.. ఆత్మలను పిలిపించడానికి ఊజా బోర్డుతో ప్రయోగాలు చేస్తారు. కానీ అది ఊహించని సంఘటనలకు దారితీస్తుంది. భయంతోపాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో దాదాపు 2 గంటల 9 నిమిషాలు ఈ ప్రేక్షకులను అలరిస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ రూ.70 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. IMDB రేటింగ్ 7.5లో ఈ ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రస్తుతం ఈ మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కామెడీ లను ఇష్టపడేవారికి రోమాంచం బెస్ట్ ఛాయిస్. ఈ ను హిందీలో కప్కపి పేరుతో రీమేక్ చేశారు. ఇందులో తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 23న ఈ అడియన్స్ ముందుకు రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.