భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 14,582 ప్రభుత్వ ఉద్యోగాలు.

ఉద్యోగార్థులకు భారీ గుడ్‌న్యూస్‌. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) ఎగ్జామ్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.


ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 14,582 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోవడానికి, అప్లయ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ చూడొచ్చు. నోటిఫికేషన్‌ లింక్‌ ఇదే.
ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం : జూన్‌ 9, 2025
  • దరఖాస్తులకు చివరితేది: జులై 4, 2025
  • ఫీజు చెల్లింపునకు చివరితేది : జులై 5, 2025
  • దరఖాస్తు సవరణ తేదీలు: జులై 9 నుంచి 11 వరకు
  • కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షలు (సీబీటీ 1) : ఆగస్టు 13 నుంచి 30 వరకు
  • కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్షలు (సీబీటీ 2) : 2025 డిసెంబర్‌
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.