భారత్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి ఈ సంవత్సరం జనవరిలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ మోడల్స్ లో బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.
తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నా.. అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఈ హ్యాండ్‌సెట్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లి్‌ప్‌కార్ట్‌లో (Flipkart) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్‌ఫోన్ (Infinix Smart 9 HD Smartphone) కోరల్ గోల్డ్, మెటాలిక్ బ్లాక్, మింట్ గ్రీన్, నియో టైటానియం వంటి కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరియు భారత్‌లో ఈ ఫోన్ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లోనే విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6699 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా రూపొందించారు. ఫలితంగా పొరపాటున ఈ ఫోన్ కింద పడినా డ్యామేజీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని విడుదల సమయంలోనే సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది. అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైనమిక్ బార్ ఫీచర్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కేవలం 188 గ్రాములుగా ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G50 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 3GB LPDDR4x ర్యామ్, 64GB eMMC 5.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1 TB వరకు స్టోరేజీని పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 గో ఆధారిత XOS 14 ను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 13MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 4G VoLTE, WiFi 802, బ్లూటూత్ 5.0, USB-C ఛార్జింగ్ పోర్టుతోపాటు 3.5mm ఆడియో జాక్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS తో కూడిన స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
































