తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల స్కీమ్స్ ను అమలు చేస్తోంది. వాటిల్లో రాజీవ్ యువ వికాసం పథకం కూడా ఒకటి.
ఈ పథకం కింద నిరుద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం రూ. 4లక్షల ఆర్థిక చేయూతను అందిస్తుంది. అయితే తాజాగా ఈ పథకం కింద కీలక అప్ డేట్ ఒకటి వచ్చింది. ఇప్పటి వరకు చాలా మంది రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆన్ లైన్ లో చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఈ ఆన్ లైన్ దరఖాస్తులను 15వ తేదీలోకా పరిశీలించి సంబంధిత బ్యాంకులకు పంపించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు సంబంధిత మండల కన్వీనర్లకు, పలు కార్పరేషన్ల అధికారులకు.. ఇంకా ఎల్ డీఎం, జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ నుంచి అనుదీప్ దురిశెట్టి టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. రేపు రాజీవ్ యువవికాసం దరఖాస్తులు బ్యాంకులు చేరుతాయి. రాజీవ్ యువవికాసం స్కీమ్ కింద ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న సంబంధిత పత్రాలను ఇంకా సమర్పించని వారు ఉన్నట్లయితే త్వరపడాలని తెలిపారు. తమ వార్డుకార్యాలయాల్లో వెంటనే వాటిని సమర్పించాలని సూచించారు.
ఇప్పటి వరకు 1.28లక్షల దరఖాస్తులు అందాయని ఇందులో 1.11లక్షల దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించడం పూర్తయ్యిందన్నారు. వీటిలో కూడా ఇప్పటికే 40వేల వరకు దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు పరిశీలన కోసం పంపించినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ రాజీవ్ యువవికాసం స్కీమ్ కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. సిబిల్ స్కోర్ వదంతులను నమ్మకూడదని సూచించారు. సిబిల్ స్కోర్ ప్రామాణికం అంటూ ఏమీ ఉండదన్నారు. అర్హులు అందరికీ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.
జూన్ 2వ తేదీ కల్లా లబ్దిదారులకు మంజూరు లెటర్లు అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత తలెత్తుకుని బతికేందుకు రాజీవ్ యువవికాస స్కీమును తీసుకువచ్చినట్లు తెలిపారు. అంటే దరాఖాస్తుదారులకు రెండు శుభవార్తలు అందాయని చెప్పవచ్చు