TG SSC 2026 Results Date and Time| తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు (TG 10th Calss Results) విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 29న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా.ఇ.నవీన్ నికోలస్ హాజరుకానున్నారు. మార్చి 14 నుంచి ఈ నెల 13వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను www.eenadu.net, results.bse.telangana.gov.in వెబ్సైట్లలో హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి నేరుగా తెలుసుకోవచ్చు.






