Aadhaar Update: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే సరైన అవసరం వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
దేశంలో ప్రతి ఒక్క పనికి ఆధార్ ఆధారమైనందున ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ కేవలం 50 రూపాయలకే మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డులో అన్నింటికంటే ముఖ్యమైనది మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉంటే మిగిలిన చాలా వివరాలను ఇంట్లోంచే సరిచేసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఇతర తప్పులుంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అప్ డేట్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆధార్ కార్డులో పాత నెంబర్ ఉండి మీరిప్పుడు వేరే నెంబర్ వాడుతుంటే కొత్త నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోడానికి కేవలం 50 రూపాయలు ఫీజుంటుది.
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడం ఎలా
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఆప్షన్ తీసుకుని ఆధార్ మొబైల్ అప్‌డేట్ బాక్స్ టిక్ చేయాలి. అందులో ఇచ్చిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే వారం రోజుల్లో మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుకు అప్‌డేట్ అయిపోతుంది.
ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడం ఎలా
యూఐడీఏఐ డేటా బేస్‌లో అంటే మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి మొబైల్ అప్‌డేట్ ఫారం ఫిల్ చేసి ఇవ్వాలి. బయోమెట్రిక్ ద్వారా నిర్ధారణ చేసుకున్నాక అప్‌డేట్ ప్రక్రియ జరుగుతుంది.