ఏఐ డిమాండ్.. ఓపెన్ ఏఐ టు మెటా.. భారత టెకీ కి కనక వర్షం..₹85 కోట్ల ప్యాకేజీ , బోనస్ ₹415 కోట్లు

సప్లై డిమాండ్.. ఈ సూత్రం అన్ని వ్యాపారాలకూ వర్తిస్తుంది. సప్లై ని మించి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా రాబడి అధికంగా ఉంటుంది.


అప్పుడు భారీగా లాభాలను కళ్ళ చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు చేసేవారు… పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు సప్లై డిమాండ్ సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తారు. ఈ సూత్రాన్ని పాటించిన భారత నేపథ్యం ఉన్న ఐటీ ఉద్యోగి ఏకంగా 500 కోట్ల దాకా సంపాదించాడు. అంతేకాదు అతడు ఇప్పుడు చాలామంది ఐటి ఉద్యోగులకు రోల్ మోడల్ అయిపోయాడు.

అతడి పేరు త్రపిత్ బన్సల్. స్వస్థలం పంజాబ్. అయితే అతడు కాన్పూర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు క్యాంపస్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లిపోయాడు. 2022 నుంచి ఓపెన్ ఎఐ లో రీసెర్చర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనతో మెటా కంపెనీ ఒప్పందం కుదరచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆయన 50 మిలియన్ డాలర్లు బోనస్ రూపంలో అందుకోబోతున్నాడు. అదే సమయంలో పది మిలియన్ డాలర్లను ప్యాకేజీ రూపంలో స్వీకరించబోతున్నాడు. ఇవన్నీ భారత కరెన్సీలో దాదాపు 500 కోట్ల దాకా ఉంటాయి.

చిన్నప్పటినుంచి కష్టపడి చదివిన బన్సల్.. తన కలల విద్యాసంస్థలైన ఐఐటి కాన్పూర్.. ఐఐఎస్సి బెంగళూరులో చదివాడు. అందులోనూ ఉన్నత మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. చివరికి ఎవరూ ఊహించని విధంగా అతిపెద్ద కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. నేటి కాలంలో ఉద్యోగాలకు భరోసా లేదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. అలాంటి తరుణంలో అతడు ఏకంగా 500 కోట్ల ప్యాకేజీ అందుకోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయని చాలామంది అంటున్నారు. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పట్టు సాధిస్తే ఉద్యోగాలు మాత్రమే కాకుండా మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దానికి బన్సల్ సాధించిన విజయమే నిదర్శనమని ఉదాహరణగా వివరిస్తున్నారు.

” ఐటి పరిశ్రమలో నూతనత్వానికి దారులు తెరిచే ఉంటాయి. ఇక్కడ పనిచేసిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తిలో తమ వంతు పాత్ర పోషించిన వారికి రెడ్ కార్పెట్ లభిస్తుంది. అటువంటి వారికి పరిశ్రమ ఎంతైనా ఇస్తుంది. ఏమైనా ఇస్తుంది. బన్సల్ వద్ద అద్భుతమైన మేధ ఉంది. దాని ఆధారంగా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి మెటా సిద్ధమైంది. ఓపెన్ ఏఐ ద్వారా బన్సల్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అందులో నూతనత్వానికి శ్రీకారం చుట్టాడు. చివరికి ఈ స్థాయికి ఎదిగాడు. భవిష్యత్తు కాలంలో బన్సల్ ఓ కంపెనీ ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మెటా ద్వారా వచ్చే 500 కోట్లతో కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో బన్సల్ ఉన్నాడని” వార్తలు వినిపిస్తున్నాయి.

ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతున్నది వాస్తవమే. కాకపోతే కాలం చెల్లిన టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం జమానా మొత్తం ఏఐ ద్వారా నడుస్తోంది.. అలాంటప్పుడు ఐటీ రంగంలో పనిచేస్తున్న వారంతా ఏఐ మీద పట్టు సాధించాలి. టెక్నాలజీలో రకరకాల ప్రయోగాలకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఉద్యోగ భద్రత ఉంటుంది. భారీగా ప్యాకేజీలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవేవీ వద్దు అనుకుంటే ఉద్యోగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.