అమాయకులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశల వలవేసి యథేచ్ఛగా బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్స్ అంటూ ఏపీకే ఫైల్‌ను పంపి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎస్‌బీఐ రివార్డు పాయింట్స్‌ను రీడీమ్ చేసుకోవచ్చంటూ సందేశాలు పంపిస్తున్నారు.
దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
”ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎస్‌బీఐ రివార్డ్స్‌ను రిడీమ్ చేసుకోవచ్చంటూ మీక్కూడా మెసేజ్ వచ్చిందా? అయితే, జాగ్రత్త! ఎస్‌బీఐ ఎప్పుడూ లింక్‌లను, ఏపీకే ఫైల్స్‌ను ఎస్‌ఎంఎస్/వాట్సప్‌లో పంపించదు. అపరిచిత ఫైళ్లు, లింక్‌లను క్లిక్ చేయడం గానీ, డౌన్‌లోడ్ గానీ చేయొద్దు” అని సూచించింది. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.