‘హరి హర వీరమల్లు’ సెన్సార్ ప్రక్రియల గురించి ఒక అప్‌డేట్ వచ్చింది.. అభిమానులకు పండగే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రం వచ్చే నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.


పీరియడ్ జానర్ లో పవన్ కళ్యాణ్ చేసిన మొట్టమొదటి చిత్రమిది. అంతే కాకుండా ఈ చిత్రం తోనే ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాని ఐదేళ్ల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో మొదలు పెట్టారు. అప్పట్లో కొంతభాగం షూటింగ్ చేసి ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఇలాంటి రోల్ లో కలలో కూడా ఊహించలేదని, ఇది మామూలు సర్ప్రైజ్ కాదంటూ అప్పట్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. అంచనాలు కూడా ఆరోజుల్లో ఈ చిత్రం భారీగానే ఉండేవి.

అన్ని అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ సినిమా రెండేళ్ల క్రితమే మన ముందుకు వచ్చేది. కానీ కరోనా కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడడం, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం ఇలా ఎన్నో కారణాల చేత షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. దీంతో మొదట్లో ఈ సినిమా పై ఉన్న అంచనాలు తగ్గుతూ వచ్చాయి. ఇక కొన్నాళ్ళకు ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ కూడా వెళ్లిపోవడం తో అంచనాలు పాతాళలోకం లోకి పడిపోయాయి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. అలా ఎట్టకేలకు ఎన్నో అడ్డంకులు దాటుకొని ఈ చిత్రం వచ్చే నెల 12 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ , రీ రికార్డింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ సోమవారం రోజున సెన్సార్ కి రా కాపీ ని పంపబోతున్నారట. జూన్ 4 కి పూర్తి స్థాయి కాపీ రెడీ అవుతుందని అంటున్నారు. అంటే సోమవారం రోజున ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ తో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది అన్నమాట. సెన్సార్ కంటే ఈ సినిమాని రీ రికార్డింగ్ సమయంలో చూసిన కొంతమంది టెక్నీషియన్స్ చెప్పిన మాట ‘సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి..అనేక సన్నివేశాలకు ఆడియన్స్ థియేటర్స్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ని అందుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెన్సార్ నుండి ఎలాంటి టాక్ రాబోతుందో చూడాలి. ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న మొట్టమొదటి చిత్రమిది. కాబట్టి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఒక ఉత్సవం లాగా జరపాలని బలంగా నిర్ణయించుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.