Anant Ambani: స్కూల్లో అంబానీ కొడుకును ఆటాడుకున్న స్టూడెంట్స్.. బికారివి నువ్వు అంటూ హేళన

అనంత్ అంబానీ తండ్రి ముఖేష్ అంబానీ దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. అంబానీ కుటుంబంలోని చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో బిలియనీర్లు, బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా కనిపించారు.
అనంత్ అంబానీకి చెందిన అత్యంత ఖరీదైన గడియారాలు, బట్టలు, కార్లను సైతం ఎన్నో చూసి ఉంటారు. అనంతర వాచ్ మార్క్ జుకర్‌బర్గ్ భార్య దృష్టిని కూడా ఆకర్షించింది. అనంత్ అంబానీ పాఠశాలలో చదువుతున్న సమయంలో అతని విద్యార్థులందరూ ‘బిచ్చగాడు’ అని పిలిచేవారు.


అనంత్ అంబానీ ముఖేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. అక్కడ భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు. అతని పాఠశాల స్నేహితులు తరచూ, “తూ అంబానీ హై యా భిఖారీ !” అని చెప్పేవారట. ఎందుకంటే అతనికి పాకెట్ మనీగా కేవలం 5 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. ఒక పాత ఇంటర్వ్యూలో నీతా అంబానీ, అనంత్ మాత్రమే కాకుండా, తన ఇతర ఇద్దరు పిల్లలు ఆకాష్, ఇషాలకు ప్రతి వారం పాకెట్ మనీగా రూ.5 కేటాయించారని ఇచ్చేవారమని చెప్పుకొచ్చారు.ఎందుకంటే, అంబానీలు తమ పిల్లలు చిన్నప్పటి నుంచి డబ్బు విలువను నేర్చుకోవాలని, అందుకే 5 రూపాయలు మాత్రమే పాకెట్‌ మనీగా ఇచ్చేవారమని తెలిపారు. ఇక, అనంత్ అంబానీ స్కూల్ క్యాంటీన్‌కి వెళ్లి జేబులోంచి కేవలం రూ.5 మాత్రమే తీసి కొనుగోలు చేస్తే తోటి విద్యార్థులందరూ హేళన చేశారట.

అయితే స్కూళ్లో తనను హేళను చేస్తున్న విషయాన్ని అనంత్ వచ్చి ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు చెప్పినప్పుడు కొడుకు మాటలు విని పగలబడి నవ్వారు. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో సభ్యులుగా ఉన్నప్పటికీ, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు వారి వినయపూర్వకమైన ప్రవర్తనకు ప్రసిద్ధిగా పేరుంది. చదువు పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ ఉన్నత విద్య కోసం బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. ఇప్పుడు అతను రిలయన్స్ 02C, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్. వివిధ నివేదికల ప్రకారం.. అనంత అంబానీ నికర విలువ ప్రస్తుతం $4000 కోట్లకు పైగా ఉంది.