అందమైన తామర పువ్వులు.. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షులు, ఫైబర్ బోట్లూ.. తాటి దున్నెల మీద విహారం. రోజంతా తిరిగినా తనివితీరని అందాలు.. వింటుంటే తనువు పులకరిస్తోంది కదూ! సహజ సిద్ధ అందాలను ఫోన్లో బంధిస్తూ.. ప్రకృతి రమణీయతలో మైమరచిపోయేలా ఉండాలనిపిస్తోంది. ఇంతటి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఎక్కడుందో మీకు తెలుసా?ఈ ఆకర్షణీయమైన దృశ్యం అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ ప్రాంతంలో ఉంది. కశ్మీర్ దాల్ లేక్‌ను తలపిస్తున్న మన ‘ఆంధ్రా దాల్ లేక్’లో విహరిద్దాం పదండి