ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పథకం.. లబ్ధిదారులకు లక్ష రూపాయలు

2014లో TDP అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకాన్ని అమలు చేశారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ వర్గానికి చెందిన బాలికకు వివాహ సమయంలో రూ.50 వేలు ఇచ్చేది.


దీని కోసం దరఖాస్తుదారు వివాహ తేదీకి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం కింద రూ.లక్ష ఇస్తున్నారు.

ఈ పథకానికి అర్హత:
ఈ పథకం పొందాలంటే.. వివాహ తేదీకి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వధువు మైనారిటీ వర్గానికి చెందిన అవివాహిత అమ్మాయి అయి ఉండాలి. అలాగే ఆమె ఏపీ వాసి అయి ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలి. వధువు తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:

వధూవరుల పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు, వధూవరుల Aadhaar Card లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే Community Certificate, Residence Certificate, Marriage Invitation Card, Voter ID, Ration Card. అలాగే వధూవరుల బ్యాంకు ఖాతా వివరాలు. IFSC కోడ్, MICR కోడ్, బ్రాంచ్ పేరు, ఖాతా నంబర్, రెండింటి తాజా ఫోటోగ్రాఫ్‌లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, వివాహ ధృవీకరణ పత్రం ఇవ్వాలి.

అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు:

Bride’s photo, groom’s photo, bride’s Aadhaar card, groom’s Aadhaar card, ration card, marriage card, age proof certificate, bank pass book . పరిమాణం కనీసం 50kb గరిష్టంగా 150kb ఉండాలి. అయితే ప్రభుత్వం ఇంతవరకు వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. త్వరలో కొత్త పోర్టల్ తెరవబడుతుంది. ఆ తర్వాత పథకం అమల్లోకి వస్తుంది.

Online లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, లబ్ధిదారులు వధువు చిరునామాను తహసీల్దార్‌కు పంపాలి. తహశీల్దార్ దరఖాస్తును పరిశీలిస్తారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి Online లో పంపారు. దీనికి కనీసం వారం పడుతుంది. ఆ తర్వాత జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి Online లో డబ్బులు ఇస్తారు. దీని ప్రకారం… పెళ్లికి 10 రోజుల ముందు వధువు బ్యాంకు ఖాతాలో ఈ డబ్బు జమ అవుతుంది.