చిరంజీవి కోసం ఊహించని కథతో అనిల్ కొత్త జోనర్

రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి భారీ హైప్ ని సెట్ చేసుకుంటున్న పలు క్రేజీ కాంబినేషన్ లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో మన సీనియర్ హీరోస్ నుంచి కూడా భారీ సినిమాలు ఉన్నాయి. కాగా ఒకప్పుడు అంటే మన సీనియర్ హీరోల హవా ఉండేది కానీ తర్వాత వారి నెక్స్ట్ జెనరేషన్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కి వచ్చే సరికి వారి మార్కెట్ తగ్గిపోయింది.


కానీ ఇపుడు మళ్ళీ ఆ సీనియర్ హీరోస్ అంతా ఫుల్ ఫామ్ లోకి వచ్చి తమ స్టామినా ఏంటి అనేది చూపిస్తున్నారు. కాగా మన సీనియర్ హీరోస్ లో ఆల్రెడీ బాలకృష్ణ, వెంకటేష్ లు రికార్డు వసూళ్ల సినిమాలు అందుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మ్యాటర్ మాత్రం ఒకింత ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పక తప్పదు. కాగా మెగాస్టార్ అపుడు నుంచి కూడ ఓకే మార్కెట్ ని మైంటైన్ చేసుకుంటూ వచ్చారు కానీ ఇపుడు ఉన్న రోజుల్లో మాత్రం చిరు భారీ నెగిటివ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

దీనితో తన నెక్స్ట్ సినిమాలకి చాలా జాగ్రత్తలే తాను తీసుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా ఇపుడు చేస్తున్న విశ్వంభర సినిమా కాకుండా తన నుంచి మరో ఇద్దరు యువ దర్శకులు అనీల్ రావిపూడి అలాగే శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లలో సినిమాలు ఉన్నాయి. మరి ఈ రెండిటిపై కూడా మంచి హైప్ ఉంది కానీ మొదట అయితే అనీల్ కాంబినేషన్ లోనే సినిమా రిలీజ్ కి రానున్నట్టుగా టాక్ ఉంది. ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇపుడు ఈ క్రేజీ కాంబినేషన్ జానర్ లీక్ అయినట్టుగా తెలుస్తుంది. అనీల్ రావిపూడి కామెడీ జానర్ లోనే ఓలు ప్రాంతాలు సబ్జెక్టు కనిపిస్తుంది. ఇలా లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి జిల్లాల నేపథ్యం తీసుకుంటే మెగాస్టార్ కోసం ఊహించని నేపథ్యం తీసుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

కాగా చాలా ఏళ్ళు కితం చిరు వదిలేసిన రాయలసీమ ప్రాంత నేపథ్యంలో మెగాస్టార్ ని తాను ఈ సినిమాలో ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాల్లో కొత్త రూమర్స్ మొదలయ్యాయి. కాగా సీమ ప్రాంత నేపథ్యంలో చిరంజీవి నుంచి వచ్చిన ఇంద్ర సినిమా ఎలాంటి ఇండస్ట్రీ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కాగా ఇలానే ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చిరంజీవి కోసం తాను ఈ సినిమాకి రాసుకున్నారట. అయితే ఇది వరకు కామెడీ కూడా ఉంటుంది కదా అన్నారుగా అంటే..

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యపై కూడా పలు కామెడీ సీన్స్ లేవా అలాగే తనపై కూడా పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అలాగే మొన్న సంక్రాంతికి వస్తున్నాంలో కూడా వెంకీ మామకి ఘర్షణ టైప్ లుక్ తో వింటేజ్ ట్రీట్ ఇచ్చారు. కాగా ఇపుడు చిరంజీవి సినిమాకి కూడా అంతకు మించే తాను ప్లాన్ చేస్తున్నాడట. మరి అసలే రాయలసీమ నేపథ్యం అంటున్నారు కానీ ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా ఊచకోత తప్పదని చెప్పడంలో సందేహం లేదు.