ఏఐ మరో అద్భుతం- పెళ్లయిన 18 ఏళ్లకు గర్భం-ప్రపంచంలో తొలిసారి

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృత్రిమ మేథ (ఏఐ) వేగంగా దూసుకొచ్చేస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ వాడకం భారీ స్ధాయిలో ఉంది. ఏఐ వాడకంతో మనం ఎలా లబ్ది పొందగలమని ప్రతీ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం..


ఇలా ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగని అద్భుతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

సీఎన్ఎన్ కథనం ప్రకారం అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన గర్భ సాధన కేంద్రానికి ఓ జంట వచ్చింది. వీరు పెళ్లి అయి 18 ఏళ్లు అయినా ఇంకా పిల్లలు లేకపోవడంతో పలుమార్లు ఐపీఎఫ్ విధానంలో ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో అత్యాధునిక గర్భధారణ పద్ధతుల్ని పరీక్షించేందుకు వారు కొలంబియా వర్శిటీ ఫెర్టిలిటీ సెంటర్ కు వచ్చారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు అజోస్పెర్మియా అనే అరుదైన సమస్య కారణంగా వీరి ఐపీఎఫ్ ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తించారు.

ఈ సమస్య కారణంగా పురుషుడి వీర్యంలో తగినంత స్పెర్మ్ ఉండదు. ఒక సాధారణ ఆరోగ్యకరమైన పురుషుడి వీర్య నమూనాలో మిల్లీలీటర్‌కు మిలియన్ల స్పెర్మ్ కణాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో పురుషులలో దాగి ఉన్న స్పెర్మ్‌ను గుర్తించడానికి ఏఏఐని ఉపయోగించే స్టార్ (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) పద్ధతిని ఉపయోగించి ఈ జంట సక్సెస్ అయ్యారు.

డాక్టర్లు ఏఐ ఆధారిత వ్యవస్థతో వీర్య నమూనాను పరిశీలించి, అతనిలో దాగి ఉన్న వీర్యాన్ని కనుగొనగలిగారు. వీర్యాన్ని తిరిగి పొందాక దానిని ఐపీఎఫ్ ద్వారా భార్య అండాన్ని ఫలదీకరణం చేయడానికి వాడారు. దీంతో ఇలా స్టార్ పద్ధతిని ఉపయోగించి గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.