విదేశాలకు వెళ్లడం చాలా మంది కల. అయితే బడ్జెట్ తక్కువ అవ్వడం, వీసా ఇబ్బందుల కారణంగా విదేశాలకు వెళ్ళడం అనే కలను చాలా మంది నెరవేర్చుకోలేకపోతున్నారు.
కొన్నిసార్లు వీసా మంజూరు అవ్వదు. కొన్నిసార్లు వీసా తిరస్కరించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తక్కువ బడ్జెట్‌తో, వీసా లేకుండా ప్రయాణించగల అందమైన ప్రదేశాలున్న విదేశీ గమ్యస్థానాల కోసం వెతుకుతూనే ఉంటారు. అయితే చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండా పర్యటించే అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో దేశం భారతీయ పర్యాటకులకు వీసా రహితం చేసింది.
ఆ దేశం ఫిలిప్పీన్స్. ఇది ఆసియాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఫిలిప్పీన్స్ వెళ్లడానికి భారత పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించడం ద్వారా ఫిలిప్పీన్స్ భారతీయులకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది. ఈ నిర్ణయం భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాదు బడ్జెట్ ప్రయాణికులకు కూడా విదేశం వెళ్ళాలనే కలను తీర్చుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. కనుక ఈ రోజు మీరు ఫిలిప్పీన్స్‌కు ఎలా వెళ్లవచ్చో? ఆ దేశంలో మీరు ఏమి చూడవచ్చునో తెలుసుకుందాం..
ఫిలిప్పీన్స్ ప్రత్యేకత
ఫిలిప్పీన్స్ ఆగ్నేయాసియాలోని ఒక ద్వీప దేశం. ఇందులో 7,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. ఈ దేశం తెల్లని ఇసుక బీచ్‌లు, స్వచ్ఛమైన జలాలు, రంగురంగుల సముద్ర జీవులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడ మీరు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం రెండింటి కలయికను చూడవచ్చు. ఎవరైనా థాయిలాండ్, బాలి లేదా మాల్దీవులు వంటి దేశాలకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే.. ఫిలిప్పీన్స్ సరైనది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగలరు
ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించబడ్డాయి. ఈ వీసా 14 నుంచి 30 రోజులు మాత్రమే ఉంటుంది. పాస్‌పోర్ట్ చెల్లుబాటు 6 నెలల కంటే ఎక్కువగా ఉండాలి. రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ రుజువు ఉండాలి.
బడ్జెట్‌లో ఫిలిప్పీన్స్‌కు ఎలా వెళ్ళాలంటే
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీరు చౌక ధరలో ప్రయాణించే విమానాలను బుక్ చేసుకోవాలి. దీని కోసం థాయిలాండ్ లేదా సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవచ్చు. దీని కోసం మీరు ఫ్లైట్ స్కానర్ లేదా మెటా సెర్చ్ సైట్‌లు నుంచి ఆఫర్‌లను తనిఖీ చేయవచ్చు. ఫిలిప్పీన్స్‌లో చాలా హాస్టళ్లు , గెస్ట్‌హౌస్‌లు రాత్రికి 500-1000 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. Airbnb కూడా మంచి ఎంపిక కావచ్చు. ఖరీదైన కేఫ్‌లు, రెస్టారెంట్‌లకు బదులుగా స్థానిక ఆహారాలను ఆస్వాదించండి. దీనితో పాటు ప్రయాణించడానికి ప్రజా రవాణాను ఉపయోగించండి.
ఈ ప్రదేశాలను అన్వేషించండి
ఫిలిప్పీన్స్‌లో బోరోకే బీచ్ ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి. ఇక్కడి అనుభవం అద్భుతంగా ఉంటుంది. మీరు ఎల్ నిడో ద్వీపాన్ని కూడా అనుభవించవచ్చు. జలపాతాలు, స్నార్కెలింగ్ , సాహసాలకు ప్రసిద్ధి చెందిన సెబుకు వెళ్లండి. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా కూడా చాలా అందమైన ప్రదేశం.. ఇక్కడ మీరు చరిత్ర, ఆధునికత కలయికను చూస్తారు.