AP Cabinet: ఈ నెల 24న ఏపీ కేబినెట్‌ భేటీ

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు.


అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు.

కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.