AP CETS 2024 Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ విడుదల-తేదీలివే..!

www.mannamweb.com


ఏపీలో ఈ ఏడాది నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ ను ఉన్నత విద్యామండలి ఇవాళ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2024-25కు వివిధ విద్యాసంస్ధల్లో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో ఈఏపీసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీ సెట్, పీజీ ఈసెట్, పీఈ సెట్ వంటి పరీక్షలు ఉన్నాయి. వీటిని ఏయే వర్శిటీలు నిర్వహించనున్నాయి, కన్వీనర్లు ఎవరన్న వివరాలనూ ప్రకటించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. అలాగే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్ ను అనంతపురం జేఎన్టీయూ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం నిర్వహించే ఐసెట్‌ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. అలాగే పీజీఈసెట్ ను వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎడ్ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించనున్నాయి.
అలాగే లా సెట్ ను నాగార్జున యూనివర్సిటీ, పీఈ సెట్‌ను నాగార్జున యూనివర్సిటీ, పీజీ సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించబోతున్నాయి. మరోవైపు ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఈఏపీసెట్ ను మే 13 నుంచి 13 వరకూ నిర్వహిస్తారు. ఈసెట్ ను మే 8న నిర్వహిస్తారు. ఐసెట్ ను మే 6న, ఎడ్ సెట్ ను జూన్ 8న, లాసెట్ ను జూన్ 9న, పీజీ సెట్ ను జూన్ 3 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. ఏడీసెట్ ను జూన్ 13న నిర్వహిస్తారు.