ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలు, ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలన్నింటిలో ప్రవేశానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.


ఈ పరీక్షలో వచ్చే ర్యాంక్ ఆధారంగా వివిధ కళాశాలల్లో అడ్మిషన్ లభిస్తుంది.

ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్ష పాస్ కావల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, యూనివర్శిటీలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశం ఈ పరీక్ష ద్వారానే జరుగుతుంది. అర్హులైన అభ్యర్ధులు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 24 వరకూ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. ఎప్‌సెట్ పరీక్షలు మే 19 నుంచి 27 వరకూ వివిధ దశల్లో జరగనున్నాయి.

ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ సైన్స్ అడ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్ష రాసేందుకు ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా అప్లై చేయవచ్చు. రిజర్వ్ కేటగరీ విద్యార్ధులయితే ఇంటర్‌లో 40 శాతం మార్కులు పొందితే చాలు. ఇందులో ఇంజనీరింగ్, ఫార్మసీ పరీక్ష రాసే అభ్యర్ధులు 2025 డిసెంబర్ 31 నాటికి 16 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. గరిష్ట పరిమితి లేదు. అదే ఫార్మా డి రాసే అభ్యర్ధులు డిసెంబర్ 3 నాటికి 17 ఏళ్ల నిండి ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చ్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ ఏప్రిల్ 24. పరీక్షలు మాత్రం మే 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులకు ఓసీ విద్యార్ధులు 600 ఫీజు చెల్లించాలి. ఇక బీసీ విద్యార్ధులు 55 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులుకు 500 రూపాయలు ఫీజు ఉంది. రెండింటికీ అప్లై చేస్తుంటే ఓసీ విద్యార్ధులు 1200 రూపాయలు ఫీజు చెల్లించాలి. బీసీ కేటగరీ అభ్యర్ధులు 1100 ఫీజు కట్టాలి.