Mega DSC పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ

అమరావతి: మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులను డిసెంబర్‌ 31 నాటికల్లా భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు.


ఈ మేరకు వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. వీటిలో ఎస్‌జీటీ: 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌ పోస్టులు 52 ఉన్నాయి.