పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో (AP SSC paper evaluation errors) లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ (AP Education Department) ఇవాళ(శుక్రవారం) కీలక ప్రకటన విడుదల చేసింది.
ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది. పదోతరగతి పేపర్లు దిద్దిన ఐదుగురు ఎవల్యూవేటర్లను సస్పెండ్ చేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రీవెరిఫికేషన్- 64,251, రీకౌంటింగ్- 2112 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో 55,118 పేపర్లు.. 24,550 మంది విద్యార్థులకు సంబంధించినవి ఉన్నాయి. మూల్యాంకనంలో నిర్లక్ష్యం వహించినట్లుగా భావించిన 144 పేపర్లు ఒక మార్కు తేడా వచ్చినా కూడా ఎవల్యూవేటర్లు పట్టించుకోకుండా లెక్కించినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మార్కులను వేసే సమయంలో తప్పులు ఎక్కువగా దొర్లినట్లు విద్యాశాఖ గుర్తించింది. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు జూన్ 1వ తేదీన ఫైనల్ చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్‌షీట్ డిజైన్లలో స్వల్పమార్పులు చేయాలని పదోతరగతి బోర్డుకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.