పేదలకు తీపికబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వెంటనే ఇలా చెయ్యండి!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం 1 సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసింది. 1 సెంటు ఏం సరిపోతుంది అని మండిపడిన సీఎం చంద్రబాబు… ఇప్పుడు తమ పాలనలో..
గ్రామాల్లో పేదలకు 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల కాస్త పెద్ద ఇల్లు కట్టుకునే వీలు కలగనుంది. ఇళ్ల నిర్మాణం విషయంలో.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉపయోగపడుతుంది. అందువల్ల పేదల సొంతింటి కల నెరవేరడం తేలికవుతుంది.


ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోయింది. ఇప్పటివరకూ ఎవరూ ఇళ్లు పొందలేదు. అందువల్ల ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా ఏర్పాట్లు చెయ్యాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

త్వరలో గైడ్‌లైన్స్:
స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం త్వరలోనా విధి విధానాలను విడుదల చెయ్యబోతోంది. ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి, స్థలాలు వారికే ముందు ఇస్తారు. వారు అత్యంత నిరు పేదలుగా ప్రభుత్వం లెక్కగట్టింది. వారికి స్థలాలు ఇచ్చిన తర్వాత పేదవారికి స్థలాలు ఇవ్వనుంది. ఉగాది నుంచి ఇది ప్రారంభిస్తే.. ఇదంతా జరగడానికి ఓ సంవత్సరం పట్టవచ్చు. అలాగే ఈ ప్రక్రియ నిరంతరం సాగే అవకాశాలూ ఉన్నాయి.

కొన్ని కండీషన్లు:
* ఇదివరకు ఏదైనా పథకంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారికి.. ఈసారి స్థలం ఇచ్చే ఛాన్స్ లేదు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది.
* లబ్దిదారుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి.
* ఇదివరకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లే అవుట్లు వెనక్కి తీసుకొని, వాటిని రద్దు చేసి, కొత్తగా లే అవుట్లు ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది.
* పాత లే అవుట్లలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, వారిని మినహాయించి, ఇల్లు కట్టుకోని వారి నుంచి స్థలం తీసుకొని, వేరే ప్రాంతంలో స్థలం ఇస్తారు.
* ఇళ్లపై సోలార్ పవర్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.
* వివాదాలు లేని స్థలాలను పేదలకు కేటాయిస్తారు.

ప్రస్తుతానికి కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం త్వరలోనే మరింత సమగ్ర ప్లాన్‌ రెడీ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏపీ పేదలు ఏ క్షణం అయినా ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రకటన కోసం ఎదురుచూడవచ్చు. ఉగాది లోపే.. ఈ తెరవెనక ప్రక్రియ పూర్తి చేసి.. ఉగాది నుంచి స్థలాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.