తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది.
తిరుపతి: తిరుపతిలో ఉన్న హథీరాం బాబా భూములపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.కోట్లు విలువ చేసే మఠం భూముల అమ్మకాలపై సుప్రీం స్టేటస్ కో తెచ్చింది. మఠం భూములను కాపాడలేమని ఏపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మఠం భూములను లీజుకు తీసుకున్న వారే… కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది.
భూముల అమ్మకాన్ని సమర్థిస్తూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అయితే హైకోర్టు తీర్పును సుప్రీంలో మఠం నిర్వాహకులు సవాల్ చేశారు. జస్టిస్ MM సుందరేశ్, జస్టిస్ SVN భట్టిల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. కాగా మఠం భూములు అన్యాక్రాంతంపై ధర్మాసనం ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మఠం తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటీషన్ వేశారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది.