AP News:మాజీ మంత్రిని రూ.7కోట్లు ఇవ్వాలంటూ బెదిరించిన.. టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్

www.mannamweb.com


ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో దొంగతనం పాల్పడిన ముగ్గురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్​మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.గత నెలలో 27వ తేదీన రాత్రి ఇరువురు అగంతకులు కత్తితో ఒంగోలులోని లాయర్ పేటలో ఉన్న మాజీమంత్రి శిద్ధా రాఘవరావు ఇంటిలోపలికి గోడ దూకి ప్రవేశించారని ఎస్పీ తెలిపారు. వాచ్​మెన్​పై దాడి చేశారు. అయితే పక్కనే టేబుల్ పక్కన నిద్రపోతున్న గన్​మాన్ లేవడంతో వారు వాచ్‌మెన్‌ను వదిలేసి పోయారు. దీనిపై శిద్ధా రాఘవరావు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు అగంతకుల కోసం వెతికారు. తాజాగా సోమవారం ఉదయం 10:00కు వచ్చి బెదిరింపు లెటర్​ను శిద్ధా రాఘవరావు ఇంటి ముందువేసి పరారయ్యాడు. లేఖలో 7 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ, డబ్బు ఇవ్వకుంటే కుటుంబంతో సహా అంతం చేస్తామని బెదిరించారన్నారు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు అగంతుకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నట్లు చెప్పారు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లు ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలురుగా గుర్తుంచామన్నారు. తల్లిదండ్లులు సైతం పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. ఒక్కసారి వారం రోజుల వెనక్కి వెళ్తే.. ఏప్రిల్ 27న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇళ్లు దోపిడికీ విఫలయత్నం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇద్దరు దొంగలు కత్తులతో మాజీ మంత్రి ఇంట్లోకి ప్రవేశించారు. వాచ్‌మేన్‌పై దాడి చేసి ఆయన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకోవాలని భావించారు ఆ దొంగలు. వాచ్‌మేన్ కేకలు వేయడంతో గదిలో నిద్రిస్తున్న గన్‌మెన్ అలర్టయి బయటకు రావడంతో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగిపోయింది.