Apple Benefits: యాపిల్‌ ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

www.mannamweb.com


ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. వాటిల్లో యాపిల్‌ పండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. యాపిల్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్‌ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది..

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. వాటిల్లో యాపిల్‌ పండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. యాపిల్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్‌ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తొలగిస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

యాపిల్‌లో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. యాపిల్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో ఎలాంటి వాపునైనా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం పూట ఆపిల్ తినడం శరీరానికి మంచిది. అలాగే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత యాపిల్ తింటే మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఉదయం అల్పాహారం సమయంలో యాపిల్ తినడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చట. రాత్రిపూట యాపిల్ తినకపోవడమే మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగుతుంది.