మరో 12 రోజుల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. మొత్తం 5 స్థానాలను కూటమి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నా..
నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంది. మొత్తం 175 మందిలో 168 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయితే.. తప్ప.. గుండు గుత్తగా ఐదు స్థానాలు కూటమికి దక్కడం సాధ్యంకాదు. కానీ, ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో మరో నలుగురి కోసం కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
వీరు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలే అయి ఉండడం గమనార్హం. మరో ప్రతిపక్షం లేకపోవడం.. మరో పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటేయకపోవడంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వైపు..కూటమి నాయకులు సీరియస్ గా దృష్టి పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగలిగితే.. ఇక, ఐదు స్థానాల్లోనూ విజయం ఖాయం. అయితే.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడుసస్పెన్స్గా మారింది. తాజాగా మారు తున్న పరిణామాలను బట్టి.. ఆ నలుగురి వేట ముమ్మరంగా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ తొలిసారి విజయం దక్కించుకున్న నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారని కూడా తెలిసిం ది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ మారకపోయినా.. తన నియోజకవర్గంలో చెప్పిన పనులు చేస్తే.. తాను కూటమికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమైనట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక, మరో ముగ్గురి విషయానికి వస్తే.. వీరు కూడా రెడీ అన్నట్టుగా సంకేతాలు వచ్చాయన్న చర్చ సాగుతోం ది. అయితే.. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని.. అంటున్నారు. పేర్లు బయట కు చెక్కకపోయినా.. గతంలో వీరిపై కేసులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఇక, వైసీపీలో ఉన్నా.. ఈ ఇద్దరు రెడ్డి నాయకులు సైలెంట్ గా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో మొత్తంగా.. ముగ్గురు కలిసి వచ్చారన్నది ఖాయం. అయితే.. ఇంకొక్క ఎమ్మెల్యే వ్యవహారం తెలియాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.