జింజర్ గ్రాస్ లేదా లెమన్ గ్రాస్ దోమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాటి రసాన్ని ఇంట్లోనే చల్లుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా దోమలను రాకుండూ అడ్డుకుంటుంది.
వెల్లుల్లి సారంలో ఉండే సల్ఫర్ దోమలతో సహా వివిధ కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఎక్కువ సమయం పాటు వెల్లుల్లి వాసన ఆ ప్రాంతం నుండి వారాలపాటు దోమలను నిరోధిస్తుంది. దీంతో మీరు దోమల మోత లేకుండా హాయిగా ఉండొచ్చు.
సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు..ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కూడా దోమలు పారిపోతాయి. అలాగే, సాంబ్రాణి వెలిగించి పొగను ఇంటింటా వ్యాపింపజేయడం వల్ల కూడా దోమలు దూరంగా పారిపోతాయి. ఇలా చేయటం కూడా చాలా మంచిది.
మరో ఔషధ మొక్క తులసి. తులసి దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను చూర్ణం చేసిన నీటిని ఇంటి లోపల, వెలుపల పిచికారీ చేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.
చివరగా, ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు సన్నని నెట్ డోర్‌లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోండి. ఇంటి చుట్టూ దోమలు వృద్ధి చెందే వాతావరణం లేకుండా చూసుకోండి..ఎక్కువగా నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు త్వరగా వృద్ధి చెందుతాయి. పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వకాకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి.