రోజూ రాగి జావ తాగుతున్నారా – అయితే, ఇవీ తెలుసుకోవాల్సిందే

రాగిజావ. ప్రాచుర్యం పొందిన పోషక పదార్థం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటం లో సహకరిస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.


ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత శక్తివంతగా పని చేస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. కడుపులో సహజంగా వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉండటంతో పాటుగా బరువు తగ్గించటంలోనూ సహాయ కారిగా నిలుస్తుంది. అయితే, ఈ రాగి జావ ఎంత మంచిదో… అతిగా తీసుకుంటే సమస్యలు ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రాగిజావ సహజ సిద్దంగా శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షింయ.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. ఇక, ఇదే సమయంలో రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు… కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. సహజసిద్ధమైన డ్రింక్ గా భావించే రాగిజావ వలన ఎన్నో ప్రయోజాలు ఉన్నా.. వినియోగంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.