అన్నం, చపాతీ ఒకేసారి తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..

www.mannamweb.com


హారం మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కొన్నిసార్లు ఆహారం మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది అన్నం తినేటప్పుడు చపాతీ కలిపి తినడం మామూలే.

కానీ, ఇలా తినడం మంచిదా చెడ్డదా అన్నది ప్రస్తుత ప్రశ్న. అన్నం, చపాతీ రెండింటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అన్నం, చపాతీ ని ఒకేసారి తినకపోవడమే మంచిదంటారు నిపుణులు. అసలు ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట చపాతీ తిని దానితో అన్నం తింటే బరువు పెరుగుతారు. ఈ రెండింటినీ కలిపి తినడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తింటే తగినంత పోషకాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇలా అన్నం చపాతీ కలిపి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ వేగంగా పెరుగుతుందని అంటున్నారు. అందుకే ఈ రెండింటినీ కలిపి తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.

అన్నం, చపాతీ కలిపి తింటే అజీర్ణం సమస్య వస్తుంది. కార్బోహైడ్రేట్లు పీల్చుకోవడం వల్ల మంటతో పాటు జీర్ణక్రియ సమస్య వచ్చే అవకాశం ఉంది. అన్నం, చపాతీని కలిపి తింటే మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మరింత పెరుగుతుంది. ఇది మీకు జీర్ణ సమస్యలు వచ్చేలా చేయడమే కాకుండా శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

అన్నం, చపాతీ కలిపి తినడం కంటే.. కనీసం 2 గంటల గ్యాప్ తో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తిన్న తర్వాత చపాతీ తినాలకుంటే అన్నం తిన్న రెండు గంటల తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి రెండు ధాన్యాల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.