DMartలో వస్తువుల ధరలు రోజువారీగా మారుతాయి. వీకెండ్ అమ్మకాలు, సోమవారం క్లియర్‌అన్స్ సేల్, DMart Ready యాప్ ఆఫర్లు వినియోగదారులకు లాభం. పండుగ సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి.
DMart అంటే ప్రజలలో బాగా ప్రసిద్ధి చెందిన ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ హబ్. చాలా మంది “DMartలో వస్తువుల ధరలు ప్రతిరోజూ ఒకేలా ఉంటాయి” అనే నమ్మకం ఉంది. కానీ నిజం అలా కాదు. DMartలో వస్తువుల ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. ఉత్పత్తులపై డిస్కౌంట్లు వాటి స్టాక్, డిమాండ్, సీజన్‌ను బట్టి మారుతుంటాయి. అందుకే – ఏ వస్తువు ఏ రోజున తక్కువ ధరకు దొరుకుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
DMart అనేది కేవలం ఒక స్టోర్ కాదు, ఇది ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ షాపింగ్ డెస్టినేషన్. ఇక్కడ మీరు కిరాణా, దుస్తులు, టాయిలెటరీస్, కిచెన్ అవసరాలు, గృహోపకరణాలు, స్కిన్ కేర్, మరియు మరెన్నో వస్తువులను కనుగొనవచ్చు. వీటి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే.. వాటిని MRP కంటే చాలా తక్కువ ధరకు ఇవ్వడం. ఇదే కారణంగా, మధ్య తరగతి కుటుంబాలకు ఇది అత్యంత ఇష్టమైన షాపింగ్ పాయింట్‌గా మారింది.
DMart తరచుగా బై వన్ గెట్ వన్ ఉచిత ఆఫర్లను అందిస్తుంది. అంటే మీరు ఒకటి కొంటే, మరోటి ఉచితంగా లభిస్తుంది. ముఖ్యంగా బిస్కెట్లు, బాడీ వాష్‌లు, ఫేస్ క్రీమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి వాటిపై ఈ ఆఫర్లు కనిపిస్తుంటాయి. దీనివల్ల వినియోగదారుడు తన ఖర్చు లోపలే ఎక్కువ సరుకులు కొనగలుగుతాడు. DMartలో వారాంతపు అమ్మకాలే అసలైన బంపర్ ఆఫర్లు. ముఖ్యంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు, షాపింగ్ మాల్స్ లాంటివే రద్దీగా మారతాయి. ఈ రోజుల్లో కిరాణా, దుస్తులు, స్కిన్‌కేర్, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఇవి అత్యధికంగా బై వన్ గెట్ వన్ ఆఫర్‌ల రూపంలో ఉంటాయి. కనుక వీకెండ్‌కి ప్లాన్ చేసుకుని వెళ్లడం బెటర్.
వారాంతపు రద్దీ తర్వాత మిగిలిపోయిన స్టాక్‌ను కొన్ని DMart బ్రాంచ్‌లు సోమవారాల్లో క్లియర్‌అన్స్ సేల్ నిర్వహిస్తాయి. ఈ సేల్‌లో ఎక్కువగా నాన్-గ్రాసరీ ఐటెమ్స్, హోమ్ డెకార్, ప్లాస్టిక్ వేర్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులపై అదనపు తగ్గింపులు లభిస్తాయి. అయితే ఇది ప్రతి బ్రాంచ్‌లో ఉండకపోవచ్చు, కానీ లభించే చోట్ల వినియోగదారులు చాలా లాభపడతారు.
మీరు DMart Ready యాప్ ఉపయోగిస్తే, కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందుకోవచ్చు. సాధారణంగా సోమవారం లేదా బుధవారం, ఆన్‌లైన్ కూపన్‌లు, ఎక్స్‌క్లూజివ్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి కేవలం ఆన్‌లైన్ ఆర్డర్‌లకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఈ యాప్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తే మంచి డీల్స్ మిస్ కాకుండా ఉంటాయి.
DMart ఏడాదంతా తక్కువ ధరలతోనే ఉత్పత్తులను విక్రయిస్తుంది. కానీ దీపావళి, హోలీ, క్రిస్మస్, నూతన సంవత్సరం లాంటి పండుగ సీజన్లలో ప్రత్యేకంగా పెద్ద ఆఫర్లు ఉంటాయి. ఈ సమయంలో మీరు గిఫ్ట్ ప్యాక్స్, డెకరేటివ్ ఐటెమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు పొందొచ్చు. షాపింగ్‌కి ఇదొక గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు.
DMartలో ప్రతి రోజూ ఏదో ఒక వస్తువుపై డిస్కౌంట్ ఉంటుంది. కానీ అది ఏ వస్తువనేది ముందే చెప్పరు. అందుకే… షాపింగ్‌కు ముందే ప్రణాళిక చేసుకుని వెళ్లడం, వారాంతాల్లో లేదా సోమవారాల్లో ఎక్కువగా వస్తువులు చెక్ చేయడం ద్వారా మీరు నిజంగా పెద్ద డీల్స్ అందుకోవచ్చు. ఇది అలవాటైతే, బడ్జెట్‌లో భారీగా పొదుపు చేయడం మీ చేతుల్లోనే ఉంటుంది.
































