OnePlus 13s: OnePlus 13S వచ్చేసింది.. ధర ఎంత?

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ వన్ ప్లస్‌ తన మొట్టమొదటి కాంపాక్ట్‌ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 13S పేరిట ఈ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌, శక్తిమంతమైన బ్యాటరీతో దీన్ని విడుదల చేసింది. తాజా మొబైల్‌ లాంచ్‌తో కంపెనీ తన వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ను విస్తరణ వేగవంతం చేసింది.


వన్‌ప్లస్‌ 13ఎస్‌ కొత్త మొబైల్‌ 6.32 అంగుళాల 1.5కె ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1,600 నిట్స్‌ పీక్‌బ్రైట్‌ నెస్‌ కలిగిఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఏఐ డిటెయిల్‌ బైస్ట్‌, ఏఐ అన్‌బ్లర్‌, ఏఐ రిఫ్లెక్షన్‌ ఎరేజర్‌ వంటి టూల్స్‌ ఉన్నాయి. ఏఐ ట్రాన్స్‌లేషన్‌, ఏఐ వాయిస్‌స్క్రైబ్‌, ఏఐ కాల్‌ అసిస్టెంట్‌, ఏఐ సెర్చ్‌ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్‌ జెమిని సర్కిల్‌ టు సెర్చ్‌ ఫీచర్‌కు ఈ మొబైల్‌ సపోర్ట్‌ చేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే.. 50 ఎంపీ సోనీ LYT-700 ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 5,850mAh బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్లూటూత్‌ 6.0, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. నేటినుంచి ప్రీ బుకింగ్‌లు మొదలుకానున్నాయి, జూన్‌ 12 నుంచి విక్రయాలు ప్రారంభమతాయని కంపెనీ పేర్కొంది.

వన్‌ప్లస్‌ కొత్త మొబైల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.54,999గా కంపెనీ ప్రకటించింది. గ్రీన్‌ సిల్క్‌, బ్లాక్‌ వెల్‌వెట్‌, పింక్‌ స్టాలిన్‌ రంగుల్లో లభిస్తుంది. 12జీబీ +512జీబీ వేరియంట్‌ ధర రూ.59,999గా నిర్ణయించింది. గ్రీన్‌ సిల్క్‌, బ్లాక్‌ వెల్‌వెట్‌ రంగుల్లో లభిస్తుంది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డు సాయంతో కొనుగోలు చేసిన వారికి ఈ మొబైల్స్‌పై రూ.5వేల తగ్గింపు అందించనున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.5 వేలు తగ్గింపు, తొమ్మిది నెలల పాటు నో- కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం పొందొచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.