గోర్లు కత్తిరించే సమయంలో చాలామంది కొన్ని రకాల నియమాలను పాటిస్తారు. మరి కొంత మంది అసలు ఏమీ పట్టించుకోకుండా వారికి నచ్చిన సమయంలో నచ్చిన రోజు గోర్లను కత్తిరిస్తారు.
అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో అనేక రకాల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. గోర్లను ఏరోజు కత్తిరించాలో ఇప్పుడు తెలుసుకుందాం… సోమవారం రోజున గోర్లు కత్తిరించడం చాలా మంచిది. ఈ రోజున గోర్లు కత్తిరించడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు. మంగళవారం రోజున గోర్లు కత్తిరించినట్లయితే ఆర్థిక నష్టాలు, అనర్ధాలు సంభవిస్తాయి.
మంగళవారం రోజున ఎట్టి పరిస్థితిలో గోర్లను కత్తిరించకూడదు. బుధవారం రోజున గోర్లను కత్తిరిస్తే చాలా మంచిది. బుధవారం నాడు గోర్లు కత్తిరించినట్లయితే చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గురువారం రోజున గోర్లు కత్తిరించినట్లయితే ఇంట్లో గొడవలు, కలహాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజున గోర్లు కత్తిరించకూడదు. శుక్రవారం రోజున లక్ష్మీవారంగా పరిగణిస్తారు. కావున ఇలాంటి సమయాలలోనూ గోర్లను కత్తిరించకూడదు. శుక్రవారం రోజున గోర్లను కత్తిరించినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
దానివల్ల ఇంట్లో అప్పులు, డబ్బు నిలకడ లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. శనివారం రోజున గోర్లు కత్తిరిస్తే కష్టాలు ఎదురవుతాయి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితులలో గోర్లను కత్తిరించకూడదు. ఆదివారం రోజున గోర్లు కత్తిరించడం చాలా మంచిది. ఈ రోజున గోర్లు కత్తిరిస్తే ఆదాయం కలిసి వస్తుంది. ఇక గోర్లు కత్తిరించే సమయంలో మంచం పైన అసలు కూర్చొని కత్తిరించకూడదు. అలా చేసినట్లయితే ఇంట్లో ధన నష్టం ఏర్పడుతుంది. గోర్లను కత్తిరించిన వెంటనే బయట పారవేయాలి. ఇంట్లో పెట్టినట్లయితే నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల గోర్లు కత్తిరించే సమయంలో ఈ నియమాలను పాటించినట్లయితే ఎలాంటి అనార్ధాలు సంభవించవు.