పేర్ని నానికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ

మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నానికి అరెస్టు వారెంట్‌ జారీ అయింది. 2019లో తెదేపా కార్యకర్త చందు శ్రీహర్షపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టులో హాజరు కాకపోవడంతో ఆయనకు మచిలీపట్నం కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్‌ 19కి వాయిదా వేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.